Header Banner

సీఎం హామీ ఇచ్చినా… నార్త్ సిటీ మెట్రోకు బ్రేక్? నాలుగు నెలలుగా డీపీఆర్ మిస్సింగ్!

  Thu May 22, 2025 18:03        Politics

హైదరాబాద్‌లోని నార్త్‌ సిటీ ప్రాంతానికి కీలకమైన మెట్రో మార్గంపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాంతాన్ని పార్ట్‌-బీలో చేర్చి డీపీఆర్‌ రూపకల్పన చేస్తామని మెట్రో సంస్థ ప్రకటించగా… గడిచిన 4 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తమ ప్రాంతానికి మెట్రో ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు నార్త్‌ సిటీ ప్రాంతవాసులు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యంతో నార్త్‌సిటీ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు డీపీఆర్‌ రూపకల్పన, ప్రభుత్వానికి చేరడానికి ఇంకెంత సమయం పడుతుందో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

ముఖ్యమంత్రి ప్రకటించినా..
నార్త్‌సిటీ ప్రాంతానికి మెట్రో లైన్‌ను విస్తరిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డీపీఆర్‌ కూడా పూర్తికాలేదు. రెండో దశలో పార్ట్‌-బీగా నార్త్‌ సిటీతోపాటు, ఫ్యూచర్‌ సిటీ మెట్రో ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఇందుకు 3 నెలల్లోగా డీపీఆర్‌ ప్రభుత్వానికి అందజేయాలని జనవరి 1న మెట్రో సంస్థను ఆదేశించింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో డీపీఆర్‌ ఎందుకు జాప్యం అవుతుందనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. గడిచిన నాలుగున్నర నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

 

ప్రాజెక్ట్‌ మనుగడపై అనుమానాలు..!
ఓవైపు ఎలివేటెడ్‌ కారిడార్‌, మెట్రో మార్గాలను వేర్వేరుగా నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదకు రావడం, ఇప్పటికీ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి కాకపోవడం, ప్యారడైజ్‌ నుంచి వెళ్లాల్సిన మార్గాన్ని జేబీఎస్‌కు మార్చడం ఇలా నార్త్‌సిటీ విషయంలో ఇటీవల జరిగిన అంశాలన్నీ ప్రాజెక్టు మనుగడపై అనుమానాలను పెంచుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా నార్త్‌ సిటీ మెట్రోపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇవన్నీ కలిసి ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే హెచ్‌ఏఎంఎల్‌ మాత్రం ఈ అంశాన్ని దాటవేసేలా, డీపీఆర్‌ తుది దశలో ఉందని, పలు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని.. త్వరలోనే డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెబుతోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో రేషన్ కార్డుల గడువుపై సర్కార్ కీలక ప్రకటన! భారీ ఊరట!


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!



టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..

 

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!



ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #NorthCityMetro #MetroDelay #DPRPending #HyderabadMetro #CMPromise #PublicFrustration